ప్రజల సమస్యలపై మీడియా నిరంతరం పోరాటం చేయాలి
తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో మాజీ జడ్పిటిసి
పెద్దమందడి,జనవరి14(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక క్యాలెండర్‌ను మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి బుధవారం వెల్టూర్ గ్రామంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత మీడియాపై ఉందని, ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పనిచేస్తోందని, ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ప్రజల సమస్యలను పాలకులకు తెలియజేసే కీలక పాత్రను పోషిస్తోందని తెలిపారు. నిజ నిర్భయమైన వార్తలతో ప్రజల విశ్వాసాన్ని పొందిన పత్రికలే సమాజంలో నిలదొక్కుకుంటాయని అభిప్రాయపడ్డారు.తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, గ్రామీణ ప్రాంతాల అంశాలను నిరంతరం ప్రచురిస్తూ మంచి గుర్తింపు పొందిందని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ దండు అశోక్, మాజీ సర్పంచ్ బాలు చంద్రయ్య, మాజీ ఉపసర్పంచ్ లు మల్లికార్జున్, నాగమణి నరేష్, రఘువర్ధన్ రెడ్డి, మల్లక్ సురేష్, మహేష్ రెడ్డి, దయ్యాల నాగన్న, లాల్, జర్నలిస్టులు బండి రాజు, రాజశేఖర్ స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments