శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి
పుటాని తండాలో విస్తృత ప్రచారం
సిపిఐ నాయకులు బానోతు నాగేశ్వరరావు
ఖమ్మం బ్యూరో, జనవరి 14(తెలంగాణ ముచ్చట్లు)
రఘునాథపాలెంమండల పరిధిలోని పుటానీ తండ గ్రామపంచాయతీలో సిపిఐ 100వ శతాబ్ది ఉత్సాహాలను గ్రామ ప్రజలు సిపిఐ సానుభూతిపరులు పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ పోస్టర్లతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ... పుటాని తండలో సిపిఐ సానుభూతిపరులు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వందేళ్ళ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రజలను కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినప్పటి నుండి అనేక ఉద్యమాలు రైతులు, కార్మికులు కోసం పోరాటాలు చేసిందని వారు తెలియజేశారు. ఆరోజున బైక్ ర్యాలీతో వచ్చే వారు ముందుగా సంప్రదించాలని ఆయన కోరారు. ఈనెల 18న ఖమ్మంలోని ఎస్ ఆర్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాలను హాజరు కావాలని సభను జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, బానోత్ కిషన్, బానోతు లక్మా, బానోతు లక్ష్మ, నునావత్ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.


Comments