ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పతంగుల పంపిణీ

ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబురాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పతంగుల పంపిణీ

ఉప్పల్, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎన్‌ఎస్‌యూఐ నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందనను పొందింది.
బుధవారం హెచ్‌బి కాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్‌లోని యువకులు, బాలల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో ప్రత్యేకంగా పతంగులను ఎన్‌ఎస్‌యూఐ ఉప్పల్ అధ్యక్షులు కిషోర్ తయారు చేయించారు. ఈ పతంగులను పరమేశ్వర్ రెడ్డి ఇందిరా నగర్ ప్రాంతంలో పిల్లలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సంప్రదాయ పండుగల ద్వారా యువతను, పిల్లలను ఐక్యం చేయడం ఆనందకరమని అన్నారు. సంక్రాంతి వంటి పండుగలు సాంస్కృతిక విలువలను కాపాడుతూ సమాజంలోఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్‌బి కాలనీ డివిజన్ అధ్యక్షులు పోలేపక అంజయ్య, ఎన్‌ఎస్‌యూఐ ఉప్పల్ అసెంబ్లీ అధ్యక్షులు కిషోర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, ఉదయ్ కిరణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్, సీనియర్ నాయకులు మల్లికార్జున్, పి.జన్నీ, జగదేశ్, రమేష్, మోసాలి శ్రీనివాస్, నరేందర్, నవీన్, సురేష్, అంజయ్య, జెమినీ, ఇంజనీర్ మల్లేష్, సుధాకర్, అఖిల్, నిక్కీ, బాలకృష్ణ, మహిళా నాయకురాలు రాణి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు గణేష్, కృష్ణ, ఆకాష్, గ్యానేశ్వర్, తరుణ్, హరి, సుమంత్, సాయి, నరేష్, కిట్టు తదితరులు పాల్గొన్నారు. IMG-20260114-WA0069

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన
నాచారం, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు): యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాచారం...
తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్ ఆవిష్కరణ.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 
ఖండాంతారాల్లో సిపిఐ వందేళ్ల పండుగ
ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
రఘునాధపాలెం ప్రజల చిరకాల స్వప్నం సాకారవేళ
17 న సాయుధ పోరాట అమరుల సంస్మరణ సభ