మల్లాపూర్‌లో సంక్రాంతి సంబరాలు

నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘణంగా పతంగుల పంపిణి

మల్లాపూర్‌లో సంక్రాంతి సంబరాలు

_ప్రత్యేక ఆకర్షణగా “పతంగుల బండి”

మల్లాపూర్, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు)

సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా మల్లాపూర్ డివిజన్‌ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పతంగుల పంపిణి కార్యక్రమాన్ని ఘణంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన “పతంగుల బండి” మల్లాపూర్ డివిజన్‌లో బస్తీబస్తీ తిరుగుతూ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
పతంగుల బండి రావడంతో చిన్నారులు ఆనందంతో కేరింతలు వేస్తూ పతంగులు తీసుకున్నారు. యువతీ యువకులు, పెద్దలు సైతం పతంగులు స్వీకరించి సంక్రాంతి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా డివిజన్ మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మల్లాపూర్ డివిజన్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పతంగులు ఎగరేసే సమయంలో చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నివారించి, ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. సంప్రదాయ పండుగలను భద్రతతో పాటు ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి.జి. సుదర్శన్, బెల్లం గట్టయ్య, తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, దంతూరి రాజు గౌడ్, ముజీబ్, వుండం శ్రీనివాస్, జానీ, కోయలకొండ రాజేష్, మనోహర్, జానీ భాయ్, పర్వతాలు, కంపెల్లి శివ, నిక్కీ గౌడ్, లక్ష్మిపతి, మెహన్, నాగరాజ్, మహేష్, నరేష్ యాదవ్, శేఖర్, వరుణ్ రెడ్డి, దాసరి సాయి, డీజే దినేష్ పాల్గొన్నారు. అలాగే మహిళా నాయకురాళ్లు సోనీ గౌడ్, ఇష్రత్ బానో, ఇంతియాజ్‌తో పాటు మల్లాపూర్ యువ నాయకులు బాతరాజు రాహుల్, నెమలి సందీప్, వంగవీటి రింకు, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.IMG-20260114-WA0068

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన
నాచారం, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు): యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాచారం...
తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్ ఆవిష్కరణ.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 
ఖండాంతారాల్లో సిపిఐ వందేళ్ల పండుగ
ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
రఘునాధపాలెం ప్రజల చిరకాల స్వప్నం సాకారవేళ
17 న సాయుధ పోరాట అమరుల సంస్మరణ సభ