ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన కార్పొరేటర్ బన్నాల గీతా
చిల్కానగర్, జనవరి (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ పరిధిలోని కళ్యాణపురి ఇందిరానగర్ కాలనీలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ, కాలనీ అధ్యక్షుడు ముద్దం శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి మల్లికార్జున్, బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారని ప్రశంసించారు. బస్తీ వాసులు, ముఖ్యంగా చిన్నారులు వేసిన ముగ్గులు సాంప్రదాయబద్ధంగా, ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. మహిళల్లోని సృజనాత్మకతను వెలికి తీసే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి సానుకూల సందేశాన్ని ఇస్తాయని, సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించడంతో పాటు మహిళలకు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.ముగ్గుల పోటీల్లో అనేక మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయడం ఆనందంగా ఉందని పేర్కొంటూ, బస్తీ వాసులకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎద్దుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, ముద్దం శ్రీనివాస్యాదవ్, బాలకృష్ణ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రఫీ, సంజీవ్ శ్యామ్, బాలు, అలాగే బస్తీ వాసులు శ్రీకాంత్, బాలయ్య, మధు తదితరులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments