విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన

మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి

విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన

నాచారం, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):

యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాచారం ఎస్ఐ మైబెల్లి, ఎన్‌డీఎఫ్ కన్వీనర్ నందికొండ శ్రీనివాస్ రెడ్డి, యాంటీ డ్రగ్ ఫోరం కన్వీనర్, మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి పిలుపునిచ్చారు.నాచారం లోని మదర్సా సుఫ్ఫతుల్ ముస్లిమీన్ హాస్టల్ లో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి జీవితానికే కాకుండా కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తుపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువు, క్రమశిక్షణ, దేశ సేవ వైపు దృష్టి సారించాలని సూచించారు.యువతను మత్తు పదార్థాల ముప్పు నుంచి రక్షించి, ఆరోగ్యవంతమైన మరియు బాధ్యతాయుత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. గత డిసెంబర్ 31 మరియు జనవరి 6 తేదీల్లో నిర్వహించిన మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీల్లో చురుకుగా పాల్గొన్న విద్యార్థులు, యువతకు సీడీఎస్ బిల్డింగ్‌లో సర్టిఫికెట్లను ఘనంగా పంపిణీ చేశారు. మిగిలిన పాఠశాలలకు సంబంధించిన సర్టిఫికెట్ల పంపిణీని రాబోయే రోజుల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాచారం పోలీస్ సిబ్బంది గుంటుక కృష్ణా రెడ్డి, మామిడాల రాజా రెడ్డి, మొహమ్మద్ ఫసియుIMG-20260114-WA0139ద్దీన్, నమిలికొండ సునీల్ రెడ్డి, జావీద్, వాలి, షెరీఫుద్దీన్, రేవంత్, ఎస్‌ఎస్‌ఎస్ యువసేన కిషోర్ రెడ్డి, కరుణాకర్, శ్రీధర్, స్నేహిత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన
నాచారం, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు): యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాచారం...
తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్ ఆవిష్కరణ.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 
ఖండాంతారాల్లో సిపిఐ వందేళ్ల పండుగ
ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
రఘునాధపాలెం ప్రజల చిరకాల స్వప్నం సాకారవేళ
17 న సాయుధ పోరాట అమరుల సంస్మరణ సభ