సంక్రాంతి ముగ్గుల పోటీలతో అమ్మపల్లి గ్రామంలో పండుగ కళ
పెద్దమందడి,జనవరి14(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో గ్రామాన్ని పండుగ శోభతో నింపారు.ఈ కార్యక్రమంలో అమ్మపల్లి గ్రామ సర్పంచ్ గౌని మాధవి, వెంకటేశ్వర్ రెడ్డి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. అంతేకాకుండా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సాధారణ ప్రోత్సాహక బహుమతులు అందజేసి మహిళలను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు నాయక్ , వార్డు సభ్యులు శ్వేత, వరలక్ష్మి , పద్మ ఉద్య నాయక్ , చంద్రశేఖర్ పాల్గొన్నారు.అలాగే మాజీ సర్పంచ్ రమేష్ మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు గారు, మాజీ వార్డు సభ్యులు,కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments