ఖండాంతారాల్లో సిపిఐ వందేళ్ల పండుగ

ఖండాంతారాల్లో సిపిఐ వందేళ్ల పండుగ

ఖమ్మం బ్యూరో, జనవరి 14(తెలంగాణ ముచ్చట్లు)

సిపిఐ శతాబ్ది ఉత్సవాలు భారతదేశంలోనే కాకుండా ఖండాంతారాల్లో సైతం జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ కుటుంబాలకు చెందిన వారు అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో నివసిస్తున్న యువకులు సిపిఐ శతాబ్ది సంబురాలను జరుపుతున్నారు. వామపక్ష భావాజాలం కలిగిన యువకులు ఒక చోట పార్టీ చరిత్రను మననం చేసుకుంటూ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ మరింత పురోగమించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ శతాబ్ది ఉత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నారు. సిపిఐ ఖమ్మం నగర కార్యదర్శి ఎస్ కె జానిమియా తనయుడు లతీఫ్ పాషా -నేతృత్వంలో లండన్లో సిపిఐ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఇతర దేశాల్లో కూడా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తూ రానున్న కాలంలో కమ్యూనిస్టులు పురోగమించాలని కమ్యూనిజం మాత్రమే సరైన ప్రత్యామ్నాయం అని విద్యావంతులు చాటిచెబుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన
నాచారం, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు): యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాచారం...
తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్ ఆవిష్కరణ.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 
ఖండాంతారాల్లో సిపిఐ వందేళ్ల పండుగ
ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
రఘునాధపాలెం ప్రజల చిరకాల స్వప్నం సాకారవేళ
17 న సాయుధ పోరాట అమరుల సంస్మరణ సభ