నాలుగోసారి వాత తప్పదు!

ఒళ్లంతా విషం నింపుకొని బీఆర్‌ఎస్ నేతలు కారుకూతలు కూస్తున్నారు

నాలుగోసారి వాత తప్పదు!

- *అప్పటి ‘ప్రభువుల’కు ప్రజలే బుద్ధి చెబుతారు : మంత్రి పొంగులేటి*

- *అశ్వారావుపేటలో కాంగ్రెస్ సర్పంచుల సన్మాన సభలో బీ ఆర్ ఎస్ పార్టీ పై ధ్వజం*

ఖమ్మం బ్యూరో, జనవరి 13(తెలంగాణ ముచ్చట్లు)

అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే కర్రుకాల్చి వాత పెట్టినా.. గత పాలకులకు ఇంకా జ్ఞానం రాలేదు. ఒళ్లంతా విషం నింపుకొని రోడ్ల మీద కారుకూతలు కూస్తున్న ఆనాటి 'ప్రభువుల'కు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాలుగోసారి వాత తప్పదని తెలంగాణ  రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అశ్వారావుపేటలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ మద్దతుదారులైన 60 మంది సర్పంచుల సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పదేళ్ల పాలనలో పేదవాడికి ఇల్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేని అప్పటి పాలకులు, ఇప్పుడు అధికారం పోయిందన్న అక్కసుతో సోల్లు వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో నియోజకవర్గానికి కనీసం 10 ఇళ్లు కూడా ఇవ్వని వారు ఇప్పుడు తమ ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే మూడుసార్లు చెంప చెళ్లుమనిపించిన ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తీర్పును పునరావృతం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

అశ్వారావుపేట గిరిజన ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధతో తమ ప్రభుత్వం ఇక్కడకు 4,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని, ఇది గిరిజన ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే మేడారం జాతరను 200 ఏళ్ల వరకు చెక్కుచెదరని రీతిలో అద్భుతమైన రాతి కట్టడాలతో పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజలను ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా, గ్రామాల్లో నిస్వార్థంగా సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సర్పంచులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్మువ్వా విజయబాబు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు.IMG-20260113-WA0026IMG-20260113-WA0021

Tags:

Post Your Comments

Comments

Latest News

రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి
    ఎల్కతుర్తి, జనవరి 13: (తెలంగాణ ముచ్చట్లు) రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎల్కతుర్తిలో నిర్వహించిన అవగాహన సమావేశంలో డిసిపి ధార కవిత పాల్గొని మాట్లాడారు.
క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ముచ్చట్లు–2026 క్యాలెండర్ ఆవిష్కరణ
కాప్రా లో తెలంగాణ ముచ్చట్లు–2026 క్యాలెండర్ ఆవిష్కరణ
నాలుగోసారి వాత తప్పదు!
కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన
ఎల్కతుర్తిలో ‘తెలంగాణ ముచ్చట్లు’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ