కాప్రా సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ శ్రీహరికి ఘన స్వాగతం

కాప్రా సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్ శ్రీహరికి ఘన స్వాగతం

కాప్రా, డిసెంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు):

గ్రేటర్ హైదరాబాద్ ఉప్పల్ జోన్ పరిధిలోని కాప్రా సర్కిల్ నూతన డిప్యూటీ కమిషనర్‌గా శ్రీహరి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా సమాచార హక్కు చట్టం నిర్వాహకులు తాడూరి గగన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గగన్ కుమార్ మాట్లాడుతూ, కాప్రా సర్కిల్ పరిధిలో అక్రమ కట్టడాలు విస్తృతంగా జరుగుతున్నాయని, వీటన్నింటిపై కఠిన చర్యలు తీసుకొని అడ్డుకట్ట వేయాలని కోరారు. అలాగే జిహెచ్ఎంసీ ద్వారా మంజూరవుతున్న పర్మిషన్లపై సమగ్ర విచారణ చేపట్టాలని డిప్యూటీ కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీహరికి కాప్రా సర్కిల్‌కు స్వాగతం తెలుపుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ అక్రమ నిర్మాణాల నియంత్రణలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షించారు. డిప్యూటీ కమిషనర్‌గా శ్రీహరి చేపట్టిన బాధ్యతలు విజయవంతంగా కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది జర్న‌లిస్టుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
_జీవో 252లో మార్పులు – ఇండ్ల స్థలాలకు కోర్టు అడ్డంకులు లేని విధానం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం హైదరాబాద్‌ , జనవరి 10 (తెలంగాణ ముచ్చట్లు):...
కొండా గోపి పుట్టినరోజు సందర్భంగా నాగులవంచలో రక్తదాన శిబిరం..
శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచలో ఘనంగా సంక్రాంతి సంబరాలు..
పాత్రికేయ విలువలకు నిలువెత్తు ప్రతీక  టీ.కే. లక్ష్మణ రావు
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు
సింగరేణి విశ్రాంతి కార్మికులకు కనీస పెన్షన్ పెంచాలి
యాదవులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి