కాప్రా లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

కాప్రా లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

కాప్రా, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కాప్రా గాంధీనగర్‌లోని కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, రామకృష్ణ మఠం వ్యవస్థాపకులు స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు  బి. శివరామకృష్ణ, కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు – ఎస్ ఆర్ సి సంస్థ ఎండీ తన్నీరు శ్రీహరి, కాంగ్రెస్ యువ నాయకుడు రాకేష్ యాదవ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.విఠల్ నాయక్ మాట్లాడుతూ రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు అయిన స్వామి వివేకానంద విదేశాలలో యోగ, హిందూ మత మహత్త్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచ వేదికలపై ప్రాచుర్యం చేసిన మహానుభావుడని కొనియాడారు.లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బి. శివరామకృష్ణ మాట్లాడుతూ స్వామి వివేకానంద సమాజంపై అత్యంత ప్రభావం చూపిన మహనీయుడని, తన రచనలు, సూక్తుల ద్వారా యువతకు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శనం చేశారని అన్నారు. ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు మాట్లాడుతూ షికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత మహాసభలో స్వామి వివేకానంద హిందూ మతం, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతూ చారిత్రక ప్రసంగం చేశారని గుర్తు చేశారు. కుల, వర్ణ వివక్షను తీవ్రంగా వ్యతిరేకించిన గొప్ప సంస్కర్తగా పేర్కొన్నారు.సీనియర్ కాంగ్రెస్ నాయకులు తన్నీరు శ్రీహరి మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద ఆశయాలను ఆచరణలో పెట్టాలని, శారీరక, మానసిక దృఢత్వంతో సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ యువ నాయకుడు రాకేష్ యాదవ్ మాట్లాడుతూ పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుందని, ఆత్మవిశ్వాసమే విజయానికి మార్గమని వివేకానంద చెప్పిన సూక్తులు నేటి యువతకు దిక్సూచిగా నిలుస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఏఎంసీ మాజీ డైరెక్టర్ కొబ్బనూరి నాగరాజు, గాంధీనగర్ యువజన సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు జి. బాలయ్య, హరి, రాజు, మనోజ్ కుమార్, ప్రణవ్ సాయి, మల్లేష్, సన్నీ, పల్లెదావఖానా సిబ్బంది యం. మంజుల (ఎంపిహెచ్ఏ-ఎఫ్), ఆశా వర్కర్లు వి. ప్రసన్న, పి. వాణి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన
  కూకట్పల్లి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి
ఎల్కతుర్తిలో ‘తెలంగాణ ముచ్చట్లు’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
మల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
రేవంతన్న సర్కార్ గృహజ్యోతి పథకంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు
స్వామి వివేకానంద జయంతి విగ్రహానికి పూల మాల వేసిన
సంక్రాంతి ముగ్గుల పోటీలకు మంచి స్పందన
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేఖరి రాంబాబును పరామర్శించిన.!