జాతీయ అండర్-17 ఫుట్‌బాల్‌కు లోకేష్ నాయుడు ఎంపిక
గ్రామీణ ప్రతిభకు జాతీయ గుర్తింపు
పెద్దమందడి,జనవరి12(తెలంగాణ ముచ్చట్లు):
గ్రామీణ ప్రాంత యువ క్రీడాకారుడి ప్రతిభ జాతీయ స్థాయిలో మరోసారి వెలుగులోకి వచ్చింది.పెద్దమండడి మండలం జగత్‌పల్లి గ్రామానికి చెందిన యువ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కె. లోకేష్ నాయుడు జాతీయ స్థాయి అండర్-17 ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.డిసెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అండర్-17 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో హకీంపేట క్రీడా పాఠశాల తరపున ప్రాతినిధ్యం వహించిన లోకేష్ నాయుడు అద్భుత ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు పొందారు. పోటీల సందర్భంగా ఆయన చూపిన వేగం, చురుకుదనం, సమయస్ఫూర్తి సెలెక్టర్లను ఆకట్టుకోవడంతో జాతీయ స్థాయి జట్టుకు ఎంపికైనట్లు వినోద్ కుమార్ తెలిపారు.జాతీయ స్థాయి అండర్-17 ఫుట్‌బాల్ పోటీలు ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హర్యానాలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొని రాష్ట్రానికి, అలాగే తన స్వగ్రామానికి మంచి పేరు తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ నాయుడు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. లోకేష్ ఎంపికపై గ్రామస్తులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


Comments