పోటా పోటీగా కొనసాగుతున్న జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలు 

పోటా పోటీగా కొనసాగుతున్న జాతీయస్థాయి సీనియర్ కోకో పోటీలు 

 IMG-20260112-WA0090IMG-20260112-WA0089

 కాజీపేట్ జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు)

హనుమకొండ జిల్లా కాజీపేట్ జంక్షన్ సమీపంలోని రైల్వే స్టేడియంలో కొనసాగుతున్న 58వ జాతీయస్థాయి సీనియర్ కోకో ఛాంపియన్షిప్ 2025-26 టోర్నమెంట్ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారుల నడుమ పోటీలు రెండో రోజు పోటాపోటీగా నిర్వహించబడ్డాయి. దేశ నలుమూలల నుండి వచ్చిన క్రీడ కారులు, అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది తెలంగాణ కోకో అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి అస్సాం వర్సెస్ తమిళనాడు మహిళలు, హర్యానా వర్సెస్ మద్యభారత్ మహిళలు, చత్తీస్గడ్ వర్సెస్ పోలీస్, ఢిల్లీ వర్సెస్ హర్యానా పురుషుల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లకు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఉదయం సెక్షన్లో మహిళ పురుష 33 జట్లు సాయంత్రం 31 జట్లు మొత్తం 64 క్రీడ జట్టులు మైదానంలో క్రీడలకు అఫీషియల్స్ సమక్షంలో క్రీడాకారులు పోటీపడ్డారు. పట్టణంలో జరుగుతున్న జాతీయ స్థాయి కోకోపోటీలను ప్రత్యక్షంగా తిలకించేందుకు క్రీడాకారులు అభిమానులు భారీగా తరలివచ్చారు . ఈ కార్యక్రమంలో ఇండియా కోకో ఫెడరేషన్ కార్యదర్శి ఉక్కర్ సింగ్, కోశాధికారి శర్మ, రాష్ట్ర కోకో ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, డి వై ఎస్ ఓ అశోక్ కుమార్, అజీజ్ ఖాన్, కైలాసం యాదవ్ ,ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట శ్యాం ప్రసాద్ బోర్డ్ చైర్మన్లు కుసుమ సదానందం, కన్వీనర్ సూర్య ప్రకాష్ తదితరులతో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన సంఘాల అధ్యక్ష కార్యదర్శులు టీం మేనేజర్లు అఫీషియల్స్, రిఫ్రిస్ కోకో సీనియర్లు, క్రీడాకారులు లతోపాటు తదితరులు పాల్గొన్నారు .

Tags:

Post Your Comments

Comments

Latest News

కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన
  కూకట్పల్లి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి
ఎల్కతుర్తిలో ‘తెలంగాణ ముచ్చట్లు’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
మల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
రేవంతన్న సర్కార్ గృహజ్యోతి పథకంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు
స్వామి వివేకానంద జయంతి విగ్రహానికి పూల మాల వేసిన
సంక్రాంతి ముగ్గుల పోటీలకు మంచి స్పందన
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేఖరి రాంబాబును పరామర్శించిన.!