ఎన్నికల హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ముందంజ
ఉప్పల్ నియోజకవర్గంలో గృహ జ్యోతి పథకం ద్వారా లక్ష కుటుంబాలకు లబ్ధి పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాల రూపంలో అమలు చేస్తున్నారని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు.ఉప్పల్ నియోజకవర్గంలో గృహ జ్యోతి పథకం కింద లక్ష కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని ఆయన తెలిపారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో సోమవారం డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క నుంచి వచ్చిన గ్రీటింగ్స్‌ను గృహ జ్యోతి పథకం లబ్ధిదారులకు పరమేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అర్హులై నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు జీరో బిల్లు కింద ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. గృహ జ్యోతి పథకం ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డీఈ సుబ్బారావు, ఏడీఈ రవీందర్ రెడ్డి, ఏఈ కిరణ్, ఆకారపు అరుణ్ పటేల్, రఫీక్, కొల్చల్మే స్వామి కాలనీ అధ్యక్షులు గౌటి సామి, సందీప్, భాస్కర్, శివశంకర్ గౌడ్, నాగమల్లయ్య, ఆర్ కాసింగౌడ్, ఉదయ్ యాదవ్, చల్లారావు, కే భాగ్యలక్ష్మి, కొండకింది సునీత, మీసాల లక్ష్మి, నాగలక్ష్మి, నర్సింగ్మమత, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments