స్వామి వివేకానంద జయంతి విగ్రహానికి పూల మాల వేసిన
కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ చాకలి బస్తిలోని స్వామి వివేకానంద కమిటీ హాల్‌లో సోమవారం ఘనంగా నిర్వహించిన స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలకు ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం రజిత పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, యువతకు చిరస్మరణీయ ప్రేరణగా నిలిచిన మహానుభావుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించి, భారతదేశపు గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసిన మహాపురుషుడు స్వామి వివేకానంద అని తెలిపారు.శరీర బలం, మానసిక బలం, ఆధ్యాత్మిక బలం కలిసినప్పుడే నిజమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందని స్వామి వివేకానంద బోధించారని గుర్తు చేశారు. విద్య అనేది కేవలం ఉద్యోగ సాధనకు మాత్రమే కాకుండా, జీవితాన్ని నిర్మించడానికి ఉపయోగపడాలని ఆయన సందేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప్పోజి మధుచారి, సల్ల ప్రభాకర్ రెడ్డి, ముదిగొండ రవి, బూత్కూరి రాజేష్ గౌడ్, నాగుల సురేష్ నేత, బూత్కూరి నవీన్, ఎరా రాకేష్, బూత్కూరి సాయినాథ్ గౌడ్, రాజు, నర్సింగ్, శ్రీనివాస్, రవీందర్, బూత్కూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments