స్వామి వివేకానంద ఆశయాలే యువతకు మార్గదర్శకం సంగిశెట్టి రవీంద్రసాగర్

స్వామి వివేకానంద ఆశయాలే యువతకు మార్గదర్శకం సంగిశెట్టి రవీంద్రసాగర్

మల్లాపూర్, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):

స్వామి వివేకానంద జయంతినీ పుర స్కరించుకుని శక్తి సాయి నగర్ డివిజన్ బీజేపీ కార్యాలయంలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కౌన్సిల్ మెంబర్ సంగిశెట్టి రవీంద్రసాగర్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా అని, ఆయన రామకృష్ణ పరమహంస శిష్యుడుగా వేదాంతం, యోగా తత్వాలను ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ఘనంగా చాటిన మహనీయుడు వివేకానందుడని అన్నారు.రామకృష్ణ మిషన్ స్థాపన ద్వారా సమాజ సేవకు నూతన దిశ చూపారని,“లేవండి, మేల్కొండి, గమ్యం చేరేవరకు ఆగకండి” వంటి స్ఫూర్తిదాయక సందేశాలతో యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని గుర్తు చేశారు.యువత స్వామి వివేకానంద ఆశయాల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పి. లింగం గౌడ్, డివిజన్ సెక్రటరీ పుణ్యవతి, సీనియర్ నాయకులు శ్రీనివాసన్ , ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామ ని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్న విశ్వాసాన్ని వివేకానందుడు ఎప్పుడూ వ్యక్తం చేశారని నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన
  కూకట్పల్లి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి
ఎల్కతుర్తిలో ‘తెలంగాణ ముచ్చట్లు’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
మల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
రేవంతన్న సర్కార్ గృహజ్యోతి పథకంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు
స్వామి వివేకానంద జయంతి విగ్రహానికి పూల మాల వేసిన
సంక్రాంతి ముగ్గుల పోటీలకు మంచి స్పందన
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేఖరి రాంబాబును పరామర్శించిన.!