ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాస్టర్లకు దుస్తుల పంపిణీ
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, డిసెంబర్ 31 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాస్టర్లకు దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాస్టర్లకు దుస్తులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజ సేవలో ముందుండే పాస్టర్లు ప్రజల మధ్య ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ పాలన కొనసాగుతుందని, అవసరమైన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తామని తెలిపారు.అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ పరిధిలోని చిల్కానగర్, బీరప్పగడ్డ ప్రాంతాలకు చెందిన 29 మంది పాస్టర్లకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తో కలిసి దుస్తులు పంపిణీ చేశారు.అనంతరం చిల్కానగర్ డివిజన్‌కు చెందిన పాస్టర్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని శాలువాతో సత్కరించి, క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేయించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీనాయకులు ఎదుల్ల కొండల్ రెడ్డి, మాస శేఖర్, బంటి గౌడ్, స్థానిక నాయకులు, క్రైస్తవ సంఘ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments