రేవంతన్న సర్కార్ గృహజ్యోతి పథకంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు
నెమలి అనిల్ కుమార్
మల్లాపూర్, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప ఊరటనిచ్చిందని మల్లాపూర్ డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ఈ పథకం అమలులో భాగంగా, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి మార్గదర్శకత్వంలో మల్లాపూర్ డివిజన్‌లో నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో లేఖల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించి జీరో బిల్ పొందిన లబ్ధిదారులకు ఈ సందర్భంగా లేఖలు అందజేశారు.ఈ పథకం అమలుతో పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ ఖర్చు భారం గణనీయంగా తగ్గిందని, ప్రజల జీవితాల్లో ఆర్థిక ఊరట కలిగిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా వారు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో డీఈ సుబ్బారావు, ఏడీఈ దశరథ్, ఏఈ విజయ, మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు కప్పర సాయి, కోయగూర బాలరాజ్ గౌడ్, ముజీబ్, వి. శ్రీనివాస్, పర్వతాలు, డి. సాయితో పాటు విద్యుత్ శాఖ లైన్‌మెన్లు పాల్గొన్నారు.


Comments