కొత్త కియా సెల్టోస్ కార్ ను ఆవిష్కరించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
* అత్యాధునిక హంగులున్న ఈ మోడల్ మరింత ఆదరణ పొందాలని ఆకాంక్షించిన రామసహాయం
ఖమ్మం బ్యూరో, జనవరి 12(తెలంగాణ ముచ్చట్లు)
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన రెండో జనరేషన్ సెల్టోస్ ను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సోమవారం నగరంలోని గోపాలపురం వద్ద గల ఆటోమోటివ్ కియా షోరూంలో జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఆవిష్కరించారు. సేల్స్ జనరల్ మేనేజర్ కే. శ్రీనివాస్, సర్వీస్ మేనేజర్లు వెంకటకృష్ణ, పవన్ ఈ వాహన ప్రత్యేకతలను ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ...మిడ్ సైజ్ ఎస్ యూవీ సెగ్మెంట్లో మంచి ఇంటీరియర్, ఎక్స్ టీరియర్లతో పనోరమిక్ సన్ రూఫ్ తో ఎంతో ఆకర్షణీయంగా ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా కియా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ.. మన రహదారులకు తగినట్లుగా మోడల్ రూపకల్పన జరిగిందని, బోల్డ్ స్టైలింగ్, వెర్సెటల్ ఇంజన్ ఆప్షన్లను అందిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాంరెడ్డిని షోరూం సిబ్బంది ఘనంగా సత్కరించగా.. సెల్టోస్ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షిస్తూ ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ ( టీఏసీ ) సభ్యులు ఉమ్మినేని కృష్ణ, కాంగ్రెస్ నాయకులు మొగిలిచర్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.


Comments