కల్లూరు మున్సిపాలిటీలో ముసాయిదా ఓటర్ల తుది జాబితా విడుదల.
- మొత్తం ఓటర్లు 18,866.
- మహిళలే అధికం.
సత్తుపల్లి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ ఎం. రామచంద్రరావు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,866గా నమోదైనట్లు తెలిపారు. ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ తుది ముసాయిదా జాబితాను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు మొత్తం 40 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం ఓటర్లలో మహిళలు 9,785 మంది ఉండగా, పురుష ఓటర్లు 9,081 మంది ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నందిశెట్టి నాగేశ్వరరావు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.


Comments