రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి

   డిసిపి ధార కవిత

రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి

  ఎల్కతుర్తి, జనవరి 13: (తెలంగాణ ముచ్చట్లు)

రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎల్కతుర్తిలో నిర్వహించిన అవగాహన సమావేశంలో డిసిపి ధార కవిత పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అలాగే రోడ్డు దాటే సమయంలో రోడ్డుకు ఇరువైపులా చూసి, జాగ్రత్తగా దాటాలని సూచించారు.
ఇటీవల ఎల్కతుర్తికి చెందిన ఓ పాల వ్యాపారి హెల్మెట్ ధరించకుండా రోడ్డు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఆమె గుర్తు చేస్తూ, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు. వాహనాలను వేగంగా నడపకుండా, నెమ్మదిగా మరియు నియంత్రణతో నడపాలని తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతి వ్యక్తి సురక్షితంగా తిరిగి ఇంటికి చేరేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని డిసిపి స్పష్టం చేశారు. జంక్షన్ల వద్ద రెడ్ లైట్ పడిన సమయంలో రోడ్డును దాటకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించాలన్నారు. ఇవన్నీ పాటించినప్పుడే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
మహిళలు మరియు చిన్నపిల్లలు ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు వాహనాలు నడిపేందుకు అనుమతి ఇవ్వవద్దని, వారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏసిపి ప్రశాంత్ రెడ్డి, సిఐ రమేష్, ఎస్ఐ ప్రవీణ్‌తో పాటు పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన పెంచేలా ప్రమాణం చేయించి, ట్రాఫిక్నియమాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. రోడ్డు భద్రత అనేది వ్యక్తిగత బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ నియమాలు పాటిస్తేనే ప్రమాదరహిత సమాజం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. IMG-20260113-WA0039

Tags:

Post Your Comments

Comments

Latest News

రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి
    ఎల్కతుర్తి, జనవరి 13: (తెలంగాణ ముచ్చట్లు) రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎల్కతుర్తిలో నిర్వహించిన అవగాహన సమావేశంలో డిసిపి ధార కవిత పాల్గొని మాట్లాడారు.
క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 
కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ముచ్చట్లు–2026 క్యాలెండర్ ఆవిష్కరణ
కాప్రా లో తెలంగాణ ముచ్చట్లు–2026 క్యాలెండర్ ఆవిష్కరణ
నాలుగోసారి వాత తప్పదు!
కూకట్పల్లిలో సబ్ రిజిస్టార్ కార్యాలయ శంకుస్థాపన
ఎల్కతుర్తిలో ‘తెలంగాణ ముచ్చట్లు’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ