కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ముచ్చట్లు–2026 క్యాలెండర్ ఆవిష్కరణ
కుషాయిగూడ, జనవరి 13 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ముచ్చట్లు సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ ముచ్చట్లు–2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలు, సామాజిక అంశాలను నిజాయితీగా ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు–పోలీసు మధ్య వారధిగా పనిచేస్తున్న మీడియా సంస్థలు సమాజంలో అవగాహన కల్పించడంలో ముందుండాలని ఆయన సూచించారు.తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్‌లో రాష్ట్రంలోని ముఖ్యమైన పండుగలు, జాతీయ దినోత్సవాలు, సామాజిక అవగాహన సందేశాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని పొందుపరిచినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముచ్చట్లు ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, పోలీస్ సిబ్బంది పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణను విజయవంతం చేశారు.


Comments