కాప్రా లో తెలంగాణ ముచ్చట్లు–2026 క్యాలెండర్ ఆవిష్కరణ

కాప్రా లో తెలంగాణ ముచ్చట్లు–2026 క్యాలెండర్ ఆవిష్కరణ

  కాప్రా, జనవరి 13 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాప్రా గాంధీ నగర్‌లో తెలంగాణ ముచ్చట్లు 2026 సంవత్సర క్యాలెండర్‌ను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందమూల పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముచ్చట్లు ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వరకు సమర్థవంతంగా చేరవేస్తూ విశేష సేవలు అందిస్తున్నదని ప్రశంసించారు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని నిజాయితీగా అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ చేరాలంటే ఇలాంటి మీడియా సంస్థల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ముచ్చట్లు సంస్థ మరింత ముందుకు సాగి ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో  స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ముచ్చట్లు ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .