తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్ ఆవిష్కరణ.
- సత్తుపల్లిలో 2026 క్యాలెండర్ ఆవిష్కరణ.
- ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రశంసలు.
సత్తుపల్లి, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకొస్తూ ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక నిలుస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు.
బుధవారం సత్తుపల్లిలో తెలంగాణ ముచ్చట్లు నూతన సంవత్సర (2026) క్యాలెండర్‌ను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, సత్తుపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి సంయుక్తంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అణగారిన వర్గాల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్న పత్రికగా తెలంగాణ ముచ్చట్లు ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పత్రిక చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. నూతన సంవత్సరంలో పత్రిక మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
సీఐ తుమ్మలపల్లి శ్రీహరి మాట్లాడుతూ, చట్టం, శాంతిభద్రతల పరిరక్షణలో పత్రిక అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. బాధ్యతాయుత జర్నలిజంతో సమాజంలో అవగాహన పెంపొందిస్తోందని పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం యూనిట్ అధ్యక్షుడు ఎస్. కేశవరెడ్డి, కార్యదర్శి ఏఎస్. ప్రకాశరావులకు పత్రిక ప్రతినిధులు క్యాలెండర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెలుగులోకి రాని అనేక సామాజిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో తెలంగాణ ముచ్చట్లు కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వార్తల సేకరణలో పత్రిక ప్రతినిధుల కృషి ప్రశంసనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ అద్దంకి వెంకటరత్నం, అధ్యక్షులు రామిశెట్టి సుబ్బారావు, సాంబశివరెడ్డి, బూరుగు దాసు, మధుసూదన రాజు పాల్గొన్నారు.
అలాగే తెలంగాణ ముచ్చట్లు రిపోర్టర్ గోదా నాగబాబు, ఇతర పత్రికల రిపోర్టర్లు రామారావు, జంగం కిరణ్కుమార్, హరిబాబు, మహేశ్, సాయి, సిబ్బంది మరియు స్థానిక నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కుమార్, హరిబాబు, మహేశ్, సాయి, సిబ్బంది మరియు స్థానిక నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Comments