కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో సంక్రాంతి ముగ్గుల పోటీలు
విజేతలకు చీరల పంపిణీ
కుషాయిగూడ, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు)
మల్కాజ్గిరి కమిషనరేట్ ఉప్పల్ జోన్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ (రంగవల్లి) ప్రాంగణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అందమైన ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన కుషాయిగూడ మహిళా పోలీస్ కానిస్టేబుళ్లకు లయన్స్ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ గ్రీన్ సిటీ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్, ఉప్పల్ జోన్ అడిషనల్ డీసీపీ ఎన్. వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు చీరలను అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, పోలీస్ విభాగంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, విధి నిర్వహణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ వడ్లోజు జ్యోతిర్మయా చారి ఆధ్వర్యం వహించారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఎస్‌హెచ్‌ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎల్. భాస్కర్ రెడ్డిసబ్ ఇన్‌స్పెక్టర్లు సుధాకర్ రెడ్డి, వెంకన్న, శ్రీనివాస్, లయన్ సభ్యులు మహంకాళి నరసింహ చారి, నారా మోహన్ రావు, పోలీస్ సిబ్బంది రంగన్న, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments