అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.
16 లక్షల విలువగల 15 తులాల బంగారు నగలు,5.5 తులాల వెండి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం.
హసన్ పర్తి,జనవరి 14( తెలంగాణ ముచ్చట్లు):
పట్టపగలు దొంగతనాలు చేసే పశ్చిమ బెంగాల్ కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు కే యూసి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫేరోజ్ షేక్ తండ్రి లాలూ షేక్ (37) ముస్లిం, సుక్ చంద్ తండ్రి జాఫర్ షేక్(33) ముస్లిం, యామిన్ తండ్రి సలీం షేక్ (36) ముస్లిం, ఫిరోజ్ షేక్ తండ్రి కీ"శే అజ్గర్ షేక్ పరారీలో ఉన్నాడని వీరందరూ ముజ్ పారా గ్రామం,బేలదంగా గా తాలూకా,ముర్షిదాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారని వీరి నుండి 16 లక్షలు విలువగల 15 తులాల బంగారు నగలు,5.5 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం, హెరాయిన్ మత్తు పదార్థాలకు అలవాటు పడి పట్టపగలు దొంగతనాలు చేస్తూ వారి జల్సాల కోసం సులువుగా డబ్బులు సంపాదించడానికి పట్టపగలు ఇండ్ల తాళాలు పగలగొట్టి బంగారు, వెండి నగలు దొంగలించి డబ్బులతో జల్సాలు చేసుకుంటూ సాగిస్తారని గతంలో పశ్చిమబెంగాల్,ఆంధ్ర, మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముజ్ పారా పోలీసులు అరెస్టు చేయగా రెండు నెలలు బయటకు వచ్చిన తర్వాత ముఠాగా ఏర్పడి తెలంగాణలో దొంగతనాలు చేయాలని పథకం వేసుకొని గత సంవత్సరం డిసెంబర్ 17న హనుమకొండకు వచ్చి కేయుసి పోలీస్ స్టేషన్ పరిధిలో పరిమళ కాలనీ, సప్తగిరి కాలనీ ఇండ్లలో దొంగతనం చేసి వెళ్లిపోయారని ఆ తరువాత మళ్లీ ఈనెల 10వ తేదీన హనుమకొండకు వచ్చి మధ్యాహ్నం గోపాలపురం, శివ సాయి కాలనీలో ఒక ఇంటి తాళం పగలగొట్టి సుమారు 15 తులాల బంగారు నగలు,5.5 తులాల వెండి నగలు కొంత నగదు దొంగలించినట్లు పేర్కొన్నారు. ఇట్టి విషయంలో పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ సెంటర్ జోన్ దారా కవిత పర్యవేక్షణలో అడిషనల్ డిసిపి క్రైమ్ బాలస్వామి, ఏసీపి క్రైమ్ పి.సదయ్య, ఏసీపి హనుమకొండ పి. ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో ఆచూకీ కోసం ఆరా తీస్తున్న క్రమంలో నిందితులు మళ్లీ దొంగతనాలు చేయడానికి కే యూ సి జంక్షన్ దగ్గరకు వచ్చి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు కే యూ సి, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా కేయూసీ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా పోలీసులను చూసిన నిందితులు పారిపోతున్న క్రమంలో పట్టుకొని విచారించగా వారి నుండి సుమారు 15 తులాల బంగారు నగలు, ఐదు తులాల వెండి నగలను, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కేయూసి సి ఐ రవికుమార్ తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సి సి ఎస్ ఇన్స్పెక్టర్ కే.రామకృష్ణ, కే యూ సి ఇన్స్పెక్టర్ రవికుమార్, ఐటీ కోర్ టీం ఏ ఏ ఓ ఎండి.సల్మాన్ భాష, సిసిఎస్ రాజ్ కుమార్, సాయి ప్రసన్న కుమార్, శ్రీనివాసరాజు, హెడ్ కానిస్టేబుల్లు టి.మధుకర్,బి.చంద్రశేఖర్, ఎస్.రాములు,జి.ఉపేందర్,కే. వంశీ.జి.విశ్వేశ్వర్,జి.వినోద్ లను అభినందించారు.


Comments