సంక్రాంతి ముగ్గుల పోటీల్లో వెల్టూర్ గ్రామంలో మహిళలకు ప్రోత్సాహం
పెద్దమందడి,జనవరి14(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. మహిళలు ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే విధంగా అందమైన ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.మూడవ బహుమతి విజేతకు జి .సతీష్ చేతుల మీదుగా అలాగే బుసయ్య చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతి అందజేయడం జరిగింది. మహిళల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడేలా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments