నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
కార్పోరేటర్ ప్రభుదాస్
కాప్రా, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని తిరుమలనగర్ ఎక్స్టెన్షన్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ కాలనీకి సంబంధించిన ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. కాలనీ అభివృద్ధిలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.అనంతరం కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మాచర్ల నర్సింహ, కార్యదర్శి పావని, మల్లేష్ గౌడ్, పూసల బ్రహ్మచారి, కనకరాజు, స్వయంప్రకాష్, శ్రీను, నవీన్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments