ఘనంగా శోభన్ బాబు జయంతి వేడుకలు
Views: 3
On
నాచారం, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
దివంగత సినీ నటుడు శోభన్ బాబు జయంతి వేడుకలను శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్మెస్సార్ వర్మ ఆధ్వర్యంలో తార్నాక చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోతె శోభన్ రెడ్డి హాజరై, శోభన్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు శోభన్ బాబు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పద్మారావు, ప్రధాన కార్యదర్శి బి. లాల్ బహుదూర్ శాస్త్రి, రామకృష్ణ గంగాధర్, అశోక్, రమణ, ప్రతాప్ రెడ్డి, నరసింగ్ రావు, ప్రేమలత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
14 Jan 2026 22:00:36
నాచారం, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాచారం...


Comments