యువత బలోపేతంతోనే గ్రామ అభివృద్ధి సాధ్యం

మద్దిగట్ల సర్పంచ్ మేకల రాములు యాదవ్

యువత బలోపేతంతోనే గ్రామ అభివృద్ధి సాధ్యం

పెద్దమందడి,జనవరి14(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలోని మద్దిగట్ల గ్రామంలో మంగళవారం మద్దిగట్ల అంబేద్కర్ పులే యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీలు మరియు వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మేకల రాములు యాదవ్ హాజరయ్యారు.ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మేకల రాములు యాదవ్ మాట్లాడుతూ, గ్రామంలోని యువత అన్ని విధాలుగా బలోపేతం కావాలని, యువత చేసే సేవల ద్వారానే గ్రామానికి మంచి పేరు వస్తుందని తెలిపారు. యువత పెద్దల సూచనలు, అనుభవాలను గౌరవిస్తూ, తమ ఆలోచనలను కూడా పంచుకుంటూ అందరితో కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.అంబేద్కర్ పులే యువజన సంఘం గ్రామాభివృద్ధికి ఎప్పటికీ కృషి చేస్తుందని పేర్కొంటూ, గతంలో పెద్దలు చేసిన సేవలను గుర్తుచేశారు.అనంతరం నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులను మరియు అంబేద్కర్ పులే యువజన సంఘం నూతన కమిటీని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము రవి సాగర్, వార్డు సభ్యులు పాలెం రవి, బి. రాములు, బిలాయి నాగమ్మ, పెద్దలు డీలర్ నాగరాజు, బిలాయి నాగేంద్రం, రామగళ్ళ చంద్రయ్య, నత్తి మన్నెం, రామగల ఈశ్వర్, యువకులుIMG-20260114-WA0121 ఆర్. శ్రీను, జుంపాల ప్రవీణ్, ఆర్. రాజశేఖర్, బి. సాయి, వర ప్రసాద్, తుడుకుర్తి రాజు, నత్తి సాయి కిరణ్, బి. వెంకటేష్, కాలనీ యువకులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన
నాచారం, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు): యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాచారం...
తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్ ఆవిష్కరణ.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 
ఖండాంతారాల్లో సిపిఐ వందేళ్ల పండుగ
ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
రఘునాధపాలెం ప్రజల చిరకాల స్వప్నం సాకారవేళ
17 న సాయుధ పోరాట అమరుల సంస్మరణ సభ