రోడ్డు ప్రమాదంలో పాల వ్యాపారి మృతి.

రోడ్డు ప్రమాదంలో పాల వ్యాపారి మృతి.

 న్యాయం చేయాలంటూ రోడ్ పై బైటయించిన కుటుంబ సభ్యులు,గ్రామస్తులు.

 రెండు గంటల పాటు ఎన్ హెచ్ 563 హైవేపై రాకపోకలకు అంతరాయం.

 హసన్ పర్తి,జనవరి 14 ( తెలంగాణ ముచ్చట్లు):

 హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన పాల వ్యాపారి ఈర కుశుడు (35) బుధవారం రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించినట్లు హసన్ పర్తి పోలీసులు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే మృతుడు వ్యాపారంలో భాగంగా ఉదయం 5:30 గంటలకు పాలు తీసుకొని టీఎస్ 03ఈఎక్స్ 8120 నంబరు గల ద్విచక్ర వాహనంపై తన సొంత గ్రామమైన కేశపూర్ నుండి హనుమకొండకు వెళ్తుండగా మార్గ మధ్యలో సుమారు ఉదయం 6 గంటలకు హసన్ పర్తి గ్రామ శివారులో గల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న బ్రిడ్జి దాటుతుండగా సీతంపేట గ్రామం వైపు నుండి నిర్మాణ దశలో ఉన్న సర్వీసు రోడ్డు నుండి ఆర్ జె 04జీసీ 3349 నంబరు గల టిప్పర్ ను డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ మోటార్ సైకిల్ ను ఢీకొట్టడంతో అట్టి లారీ టైర్ల కింద పడి నడుము నుండి తల వరకు శరీరం అంతా నుజ్జు నుజ్జయి అక్కడికక్కడే మరణించినట్లు మృతుడికి భార్య 3 పిల్లలు ఉన్నారని తెలిపారు. టిప్పర్ ను నడిపిన డ్రైవర్ సాహిల్ ఆలం తండ్రి సాగిర్ దేవన్  బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య ఈర స్నేహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హసన్ పర్తి పోలీసులు పేర్కొన్నారు. 

*జాతీయ రహదారినపై ధర్నా నిర్వహించి విధులను ఆటగించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు* 

 రోడ్డు ప్రమాద తీవ్రతను చూసి కుటుంబ సభ్యులు, గ్రామIMG-20260114-WA0125IMG-20260114-WA0125 స్తులు ఎన్ హెచ్  563 హసన్ పర్తి ప్రధాన రహదారిపై బైటాయించి బాధితుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ రెండు గంటల పాటు రాస్తా రోకో ధర్నా నిర్వహించారు.నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని ఆక్సిడెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినా కూడా కేశపూర్ గ్రామస్తులు ఎర్ర గొల్ల చత్రపతి శివాజీ,ఎర్రగుల్ల శ్రీనివాస్, అబ్బనవేన రాజయ్య,దుప్పటి పాల్,మేకల బాబురావు,ఈర సునీల్,బొక్క సరోజన,ఏనుగుల శ్రీనివాస్,కొండపలకల సారయ్య,ఆరేపల్లి రమేష్, ఎనుగాల సుధాకర్,చల్ల మల్లికార్జున్,మంద సునీల్, సందెల బాలరాజు,ఈర బాబు ఆర్ఎంపి,ఎర్ర కృష్ణవేణి,మాజీ సర్పంచ్,పోలు అశోక్,ఎల్తురి రత్నాకర్ మరి కొంతమంది వ్యక్తులు హసన్ పర్తి  ఎన్ హెచ్ 563 ప్రధాన రహదారిపై బైటయించి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ సుమారు రెండు గంటల పాటు కొత్తకొండ,మేడారం జాతరకు,సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రజలకు,అంబులెన్సు వాహన రాకపోకలను అడ్డగించి పోలీసులతో వాగ్వాదానికి దిగి విధులకు ఆటంకం కలిగించారంటూ పై వ్యక్తులపై వచ్చిన దరఖాస్తు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన
నాచారం, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు): యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాచారం...
తెలంగాణ ముచ్చట్లు క్యాలెండర్ ఆవిష్కరణ.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 
ఖండాంతారాల్లో సిపిఐ వందేళ్ల పండుగ
ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
రఘునాధపాలెం ప్రజల చిరకాల స్వప్నం సాకారవేళ
17 న సాయుధ పోరాట అమరుల సంస్మరణ సభ