17 న సాయుధ పోరాట అమరుల సంస్మరణ సభ
మచ్చా వీరయ్య జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ
విలేకరుల సమావేశంలో మచ్చా విద్యాసాగర్
ఖమ్మం బ్యూరో ,జనవరి 14(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ అమరులు మచ్చా వీరయ్య, వెలగపూడి కృష్ణమూర్తి ల 77వ సంస్మరణ సభ ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మచ్చా విద్యాసాగర్ తెలిపారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సమ సమాజ నిర్మాణం కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 1949 జనవరి 17న ఆనాడు నెహ్రూ సైన్యం కాల్చి చంపారని, ఈ పోరాటంలో మచ్చా వీరయ్య, వెలగపూడి కృష్ణమూర్తి లు అమరులు అయ్యారని తెలిపారు. వారి జ్ఞాపకార్థం 77వ సంస్మరణ సభ ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో ఉదయం 9 గంటలకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ త రాష్ట్ర కార్యదర్శి పోటురంగారావు ,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏపీ అధికార ప్రతినిధి ఐఎఫ్ టు ప్రసాద్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు మచ్చ సూర్యనారాయణ , చావా రమేష్, దురుసోజు రమేష్ తో పాటు అనేకమంది అతిధులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఎన్ తిర్మల్ చే రచించిన మచ్చ వీరయ్య జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. గోకనపల్లిలో జరిగే సంస్మరణ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో మోడెం వెంకన్న, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు మచ్చ సూర్యనారాయణ, అడ్వకేట్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments