ఏఎస్ రావు నగర్‌లో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు 

ఏఎస్ రావు నగర్‌లో జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు 

ఏఎస్ రావు నగర్, ఫిబ్రవరి 28 (తెలంగాణ ముచ్చట్లు): 

జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఏఎస్ రావు నగర్ డివిజన్ టిఎస్ఐఐసి కాలనీలోని శ్రీ చైతన్య సీబీఎస్ఈ స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రభు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు, మోడల్స్, వినూత్న ఆవిష్కరణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక శక్తి వనరులు, అంతరిక్ష సాంకేతికత తదితర అంశాలపై ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. తమ ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులు స్పష్టంగా వివరించడం అందరినీ మెప్పించింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంధ్యారాణి, సత్యవాణి, ప్రపూర్ణ, వసంత, జ్యోతి, అనుప్రిత, కిరణ్, మహాదేవి తదితరులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.IMG-20260228-WA0186

Tags:

Post Your Comments

Comments

Latest News