గ్రామీణాభివృద్ధి–మహిళా సాధికారతకు ప్రాధాన్యం.

దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారె పర్యటన.

గ్రామీణాభివృద్ధి–మహిళా సాధికారతకు ప్రాధాన్యం.

దమ్మపేట, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు): 

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళా సాధికారత, విద్యా వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పూసుకుంట గ్రామపంచాయతీలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం కమ్యూనిటీ భవనం, జీపీఎస్ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్లపెంటలో మహిళా సంఘాల కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. పట్వారిగూడెం పంచాయతీ సుధాపల్లి గ్రామంలో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టగా, రాచూరుపల్లి పంచాయతీ పాతలచ్చాపురంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జమేదార్ బంజర పంచాయతీ గుర్వాయిగూడెం గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని అర్బన్ కాలనీలో అంగన్వాడీ నూతన భవనాన్ని ప్రారంభించి, సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముష్టిబండ పంచాయతీ అప్పారావుపేటలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. వడ్లగూడెం, మారప్పగూడెం గ్రామాల్లో సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. చీపురుగూడెంలో ఎంపీపీఎస్ పాఠశాలకు ప్రహరీ గోడ పనులు ప్రారంభించారు. అంకంపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫేర్‌వెల్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమాల్లోIMG-20260227-WA0087 మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .