గ్రామ పాఠశాల అభివృద్ధికి సర్పంచు ముందడుగు

సర్పంచ్ ఆధ్వర్యంలో పాఠశాల పనుల ప్రారంభం

గ్రామ పాఠశాల అభివృద్ధికి సర్పంచు ముందడుగు

పెద్దమందడి,ఫిబ్రవరి25(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వేదిక నిర్మాణం మరియు బాలికల కోసం మరుగుదొడ్ల నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ పాఠశాల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గ్రామ పంచాయతీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోతుల రామిరెడ్డి, గొంది ప్రతాపరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సుంచరమోని వెంకయ్య, ఎం. రామ్ రెడ్డి, ఎం. శ్రీకాంత్ రెడ్డి, బీకే నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .