భరత్ నగర్ కాలనీలో “బస్తీ బాట” ప్రజా సమస్యలపై కాంగ్రెస్ భరోసా

భరత్ నగర్ కాలనీలో “బస్తీ బాట” ప్రజా సమస్యలపై కాంగ్రెస్ భరోసా

_కాలనీలో పర్యటించిన నెమలి అనిల్ కుమార్ 
– తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ

మల్లాపూర్, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం ఉమ్మడి మల్లాపూర్ పరిధిలోని శక్తిసాయి నగర్ డివిజన్‌కు ఇటీవల విలీనం అయిన భరత్ నగర్ కాలనీలో “బస్తీ బాట” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ కాంగ్రెస్ నాయకుడు నెమలి అనిల్ కుమార్ కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.కాలనీలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, దోమల సమస్య, స్ట్రీట్ లైట్లు వంటి మౌలిక వసతుల కొరతపై స్థానికులు వివరించిన సమస్యలను ఆయన శ్రద్ధగా విన్నారు. సమస్యల పరిష్కారానికి వెంటనే సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో భరత్ నగర్ కాలనీలోని ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని నెమలి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవాదళ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సద్గుణ, మల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు మక్తాల బాలరాజ్ గౌడ్, వుండం శ్రీనివాస్, లక్ష్మీపతి, సురేష్ గౌడ్, కంపెల్లి శివ, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బాతరాజు రాహుల్ తదితరులతో పాటు కాలనీకి చెందిన పలువురు స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.IMG-20260227-WA0073

Tags:

Post Your Comments

Comments

Latest News

రాష్ట్రంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ’ రాష్ట్రంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ’
- కొత్తూరులో 67 ఇళ్లతో సామూహిక గృహప్రవేశాలు.- పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి ఆధునిక వసతులతో నిర్మాణం. సత్తుపల్లి, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):  సత్తుపల్లి మండలం...
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో రామిడి విజయ్ రెడ్డి పాల్గొన్నారు
విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 95వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ
చికిత్స పొందుతూ ప్రమీల రాణి మృతి
గ్రామీణాభివృద్ధి–మహిళా సాధికారతకు ప్రాధాన్యం.
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం
మానవ మనుగడకు సైన్స్ కీలకం: ఎమ్మెల్యే మట్టా రాగమయి.