గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు

గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు

కీసర, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’ (ఫేజ్–2) కార్యక్రమంలో భాగంగా మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా చీర్యాల ప్రాంతంలోని గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులకు ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు.కార్యక్రమంలో జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర పీఎస్ ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి అంజనేయులు, జవహర్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్, ఎస్‌ఐ హరిప్రసాద్ పాల్గొన్నారు.అధికారులు మాట్లాడుతూ వేగ నియంత్రణ ప్రాముఖ్యత, లేన్ క్రమశిక్షణ, చిన్న రోడ్ల నుండి ప్రధాన రహదారుల్లోకి ప్రవేశించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భారీ వాహనాల డ్రైవర్ల బాధ్యతలపై వివరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపడం మరియు డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.యువత రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించి, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260227-WA0069

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .