న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం

రిలే నిరాహార దీక్షలకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మద్దతు

న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం

వనపర్తి,ఫిబ్రవరి27(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి లో గత నాలుగు రోజులుగా న్యాయవాదులు తమ రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో పెడధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ కరువవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.న్యాయవాదుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎటువంటి కేసునైనా వాదించకూడదనే హక్కు న్యాయవాదికి ఉండదని, కక్షిదారునికి న్యాయం చేయడమే వారి వృత్తి ధర్మమని స్పష్టం చేశారు. అంతమాత్రాన వ్యక్తిగత కక్ష పెంచుకొని దాడులకు దిగడం అవివేకమని పేర్కొన్నారు.సమాజ పరిస్థితులు ఎలా ఉన్నా యువ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సలహాలు తీసుకుని న్యాయాన్ని నిలబెట్టాలని సూచించారు.వృత్తిలో ఈర్ష్య, ద్వేషాలు విడిచి తమ ప్రతిభతో మంచి పేరు సంపాదించుకోవాలని కోరారు. న్యాయవాదులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని నిరంజన్ రెడ్డి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .