ఏదులాపురం చైర్మన్ పదవి  మాదిగలకు కేటాయించాలి 

ఏదులాపురం చైర్మన్ పదవి  మాదిగలకు కేటాయించాలి 

అధిక సీట్లు.. ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నవి మాదిగలవే

విలేకరుల సమావేశంలో ఎం ఆర్ పి ఎస్ జిల్లా కార్యదర్శి కనకం జనార్ధన్ మాదిగ విజ్ఞప్తి 

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 14(తెలంగాణ ముచ్చట్లు) 

ఏదులాపురం చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు చేయబడిందని, ఏదులాపురం మున్సిపల్ ఎన్నికలలో ఎస్సీ మాదిగలు నాలుగు సీట్లు గెలుచుకున్నారని, ఎస్సీ మాల సామాజిక వర్గానికి  చెందిన ఇద్దరు సభ్యులు గెలుపొందారని అధిక స్థానాలు దక్కించుకున్న మాదిగలకు చైర్మన్ పదవి కేటాయించాలని ఎమ్మార్పీఎస్ , ఎం ఎస్ పి జిల్లా కార్యదర్శి, ఖమ్మం రూరల్ మండల ఇన్చార్జి కనకం జనార్ధన్ మాదిగ కోరారు. 

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏదులాపురం మున్సిపాలిటీలోనూ, పాలేరు నియోజకవర్గంలోనూ జిల్లా లోను అటు రాష్ట్రంలోనూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకింగ్ జనాభా అత్యధికంగా ఉందని, రిజర్వేషన్ల ప్రాతిపదికన తమ సామాజిక వర్గానికి ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని, కానీ జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఎక్కువ స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు గెలుపొందారని అటువంటి వారికి కాదని మరొకరికి కట్ట పెట్టాలనే ప్రయత్నాలు మంచిది కాదని అన్నారు. 

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని  మాదిగ సామాజిక వర్గం అక్కున చేర్చుకొని అండదండగా నిల్చారని, ఏ ఎన్నిక వచ్చిన, పార్టీకి ఎంత కష్టం వచ్చినా దశాబ్దాల తరబడి వెన్నంటే నిలిచారని అటువంటివారిని కాదని మరొక సామాజిక వర్గానికి ఇవ్వాలనే ప్రయత్నాలు మంచి పరిణామం కాదని అన్నారు. 

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని న్యాయబద్ధంగా మాదిగలకు దక్కే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల లోను, ఓటు బ్యాంకింగ్ లోను, జనాభా లోను మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే విజయం సాధించారని అటువంటి వారికే చైర్మన్ పదవి కేటాయించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎస్సీ ఉపకులం డక్కల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్నే రామారావు మాట్లాడుతూ.. ఏదులాపురం మున్సిపాలిటీ అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన మాదిగలకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దయతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ
వనపర్తి,ఫిబ్రవరి14(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.జిల్లాలో సాంస్కృతిక,...
విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్‌లో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం
మల్లికుదుర్లలో గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానం నూతన పాలక వర్గ  కమిటీ ఎన్నిక
అమరవీరుల కుటుంబాలకు దేశం ఎప్పటికి ఋణం పడి ఉంటుంది  
కేటీఆర్, హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన పాండాల శివకుమార్ గౌడ్
చిన్న పత్రికలపై చిన్న చూపు తగదు
వనపర్తి మునిసిపాలిటీలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు