మున్సిపల్ ఎన్నికలు–2026: ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

500 మీటర్ల పరిధిలో గుమిగూడరాదని కలెక్టర్ హెచ్చరిక

మున్సిపల్ ఎన్నికలు–2026: ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

మేడ్చల్–మల్కాజిగిరి, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మున్సిపాలిటీల సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా ఓట్ల లెక్కింపుకు సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపును శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఆలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన లెక్కింపు మజీద్‌పూర్‌లోని టీ చైతన్య హై స్కూల్‌లో, మూడుచింతలపల్లి మున్సిపాలిటీకి జగ్గంగూడలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో, ఎల్లంపేట్ మున్సిపాలిటీకి బైబిల్ కాలేజీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో 14 టేబుళ్లతో లెక్కింపు ప్రక్రియ చేపట్టబడుతుంది.ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను నియమించి మొత్తం 153 మంది సిబ్బందితో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. లెక్కింపు మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో, గట్టి పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలలో భాగంగా లెక్కింపు కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమిగూడIMG-20260212-WA0090రాదని ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .