నేరెడ్‌మెట్ డివిజన్‌లో 5 సంవత్సరాల అభివృద్ధి స్వర్ణయుగం

_రూ.168 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి 
_రోడ్లు, డ్రైనేజీలు, థీమ్ పార్కులు, శ్మశానవాటికలు, వీధి దీపాలు

నేరెడ్‌మెట్, ఫిబ్రవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి నియోజకవర్గంనేరెడ్‌మెట్ 136వ డివిజన్ కార్పొరేటర్ కొతపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డివిజన్ అభివృద్ధి విశేషాలను వెల్లడించారు. కార్పొరేటర్ వెల్లడించారు.ఈ 5 సంవత్సరాలు నేరెడ్‌మెట్ మరియు యాప్రాల్ ప్రాంతాల అభివృద్ధి చరిత్రలో స్వర్ణయుగంగా నిలుస్తాయి. రికార్డు స్థాయిలో రూ.168 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. మాటలు కాదు, పనులతోనే ప్రజల విశ్వాసం గెలిచాం."మౌలిక సదుపాయాలపై రూ.108 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, థీమ్ పార్కులు, కమ్యూనిటీ హాల్స్, శ్మశానవాటికలు, వీధి దీపాలు వంటి పనులు చేపట్టబడ్డాయి.బాక్స్ డ్రెయిన్స్ నిర్మాణానికి రూ.53 కోట్లు ఖర్చు చేశారు:యాప్రాల్: నాగి చెరువు నుండి కాప్రా చెరువు – రూ.43 కోట్లు,ఎంప్లాయీస్ కాలనీ – రూ.6 కోట్లు అందాల్ హోమ్స్ – రూ.2 కోట్లు బ్యాంక్ కాలనీ – రూ.3 కోట్లు ఆర్‌ కే పురం చెరువు సుందరీకరణకు రూ.6 కోట్లు, నేరెడ్‌మెట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌కు రూ.1 కోటి, భద్రత కోసం రూ.30 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.కార్పొరేటర్ చెప్పారు, "మా డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్  సిఫారసుల ద్వారా దాదాపు రూ.4.16 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరు చేయించాం. ఇందులో శ్మశానవాటిక అభివృద్ధి, కొత్త బోర్‌వెల్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రధానంగా ఉన్నాయి."పార్టీ భేదాలను మానేసి ప్రతి కాలనీకి సమాన అభివృద్ధి అందించామని, డివిజన్‌లో సగానికి పైగా కాలనీల్లో 100% మౌలిక సదుపాయాలు కల్పించారని, మొత్తం 60–70% పనులు పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలో పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.కొత్త ప్రతిపాదనలను రూ.15–20 కోట్ల విలువలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ , జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ కి సమర్పించినట్లు ప్రకటించారు.కొతపల్లి మీనా ఉపేంద్రరెడ్డి  చివరగా, "ఈ 5 సంవత్సరాలు మాకు అండగా నిలిచిన ప్రతి కాలనీ అధ్యక్షుడు, సభ్యులు, అధికార యంత్రాంగం, మీడియా మిత్రులు మరియు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. పదవి ముగిసినా, నేరెడ్‌మెట్ మరియు యాప్రాల్ అభివృద్ధి కోసం సేవ ఎప్పటికీ ఆగదు," అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి  ఓటు హక్కు వినియోగించుకున్న ఐదో వార్డు అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి 
వడ్డేపల్లి,ఫిబ్రవరి11(తెలంగాణ ముచ్చట్లు) : వడ్డేపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎన్ యుగేందర్ రెడ్డి తన...
నేరెడ్‌మెట్ డివిజన్‌లో 5 సంవత్సరాల అభివృద్ధి స్వర్ణయుగం
ఆశా వర్కర్లకు వేతనాలు వెంటనే చెల్లించాలి
ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పక్రియ
నాగిలిగొండ గ్రామంలో పశు వైద్య శిబిరం.
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. ఈసారి వీఐపీ పాస్‌లు లేవు
ఎడిషన్, డార్విన్ జయంతి సందర్భంగా వైజ్ఞానిక నీరాజనం