ఇన్స్పైర్ జూనియర్ కాలేజీ లో ఘనంగా వీడ్కోలు సమావేశం.

ఇన్స్పైర్ జూనియర్ కాలేజీ లో ఘనంగా వీడ్కోలు సమావేశం.

హాసన్ పర్తి,ఫిబ్రవరి 11(తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండలోని ఎంటిర్ ఫంక్షన్ హాల్‌లో ఇన్స్పైర్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఛైర్మెన్ తీగల భరత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కేవలం చదువే కాకుండా క్రమశిక్షణ, సమయపాలన,ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని పేర్కొన్నారు.విద్యార్థులు లక్ష్య సాధన దిశగా నిరంతరం కృషి చేస్తూ ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే తప్పకుండా విజయం సాధించగలరని అన్నారు. ఇన్స్పైర్ జూనియర్ కాలేజీ లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా కళాశాల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకొని పట్టుదలతో చదువుకుంటే తప్పకుండా విజయం సాధించగలరని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుంకరి శ్రీరాం రెడ్డి,డైరెక్టర్లు తీగల రాజకుమార్,కోటిచింతల మమత కుమారి,లాడే శివ,కళాశాల అధ్యాపకులు (లెక్చరర్లు) పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.వీడ్కోలు సమావేశం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .