కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. ఈసారి వీఐపీ పాస్‌లు లేవు

ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డిజిపి శ్రీధర్, జోనల్ కమిషనర్ గంగ్వార్

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు.. ఈసారి వీఐపీ పాస్‌లు లేవు

కీసర, ఫిబ్రవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):

ఈనెల 13 నుంచి 18 వరకునిర్వహించనున్న కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవాల నిర్వహణపై డిజిపి శ్రీధర్, జోనల్ కమిషనర్ గంగ్వార్ బుధవారం ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.మహాశివరాత్రి సందర్భంగా వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు స్వామివారి దర్శనం సాఫీగా జరిగేలా ప్రత్యేక క్యూ లైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ నివారణకు పార్కింగ్ స్థలాలను గుర్తించి వాహనాల రాకపోకలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.సామాన్య భక్తుల సౌకర్యార్థం ఈసారి వాహనాలకు ఎలాంటి వీఐపీ పాస్‌లు జారీ చేయడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అందరికీ సమాన అవకాశంతో దర్శనం కల్పించడమే లక్ష్యమని తెలిపారు.భక్తులకు తాగునీరు, శానిటేషన్, వైద్య సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.ఈ పరిశీలనలో ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, ఈఓ కట్ట సుధాకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .