వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీల ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీల ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

75.56 శాతం పోలింగ్ నమోదు 

 కట్టుదిట్టమైన బందోబస్తులో స్ట్రాంగ్ రూములకు ఈవీఎంల తరలింపు

వనపర్తి,ఫిబ్రవరి11(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలకు బుధవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలో మొత్తం 88,738 ఓట్లు పోల్ కాగా 75.56 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు.మున్సిపాలిటీ వారీగా చూస్తే వనపర్తిలో 45,904 ఓట్లు పోలై 71.51 శాతం, కొత్తకోటలో 14,319 ఓట్లు పోలై 78.71 శాతం, పెబ్బేరు లో 11,912 ఓట్లు పోలై 83.11 శాతం, ఆత్మకూరులో 8,958 ఓట్లు పోలై 77.36 శాతం, అమరచింతలో 7,645 ఓట్లు పోలై 83.58 శాతం నమోదైనట్లు తెలిపారు.ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ ప్రక్రియను కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుండి వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యాదయ్య, సాధారణ ఎన్నికల పరిశీలకులు లక్ష్మిబాయి, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ కలిసి పర్యవేక్షించారు.పోలింగ్ ప్రారంభమైన వెంటనే కలెక్టర్ వనపర్తి మున్సిపాలిటీలోని తొమ్మిదో వార్డు మర్రికుంట పరిధిలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన 23, 15వ వార్డుల పోలింగ్ కేంద్రాలు, హరిజనవాడ జిల్లా పరిషత్ హైస్కూల్‌లోని 19, 21వ వార్డుల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.మర్రికుంట మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడిన కలెక్టర్, ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన శాంతిభద్రతలు అమలు చేసినట్లు తెలిపారు. పోలైన ఓట్లను పకడ్బందీ పోలీసు బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూములకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .