డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

— తెలంగాణ రాష్ట్ర రవాణా డ్రైవర్లు, కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా దయ్యాల దాసు

పెద్దమందడి,ఫిబ్రవరి10(తెలంగాణ ముచ్చట్లు):

హైదరాబాద్ నారాయణగూడలోని ఐఎన్‌టీయూసీ భవన్‌లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర రవాణా డ్రైవర్లు, కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా దయ్యాల దాసును నియమిస్తూ నియామక పత్రాన్ని సంఘం ప్రధాన కార్యదర్శి గోదా మల్లేష్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.ఈ సందర్భంగా దయ్యాల దాసు మాట్లాడుతూ.. తనపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు.తనకు ఈ బాధ్యత అప్పగించిన ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి గోదా మల్లేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు సంఘం అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం పోరాడతానని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు, కార్మికులకు సంఘం బలంగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని దయ్యాల దాసును అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .