నేడు విద్యుత్ పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేత
పీఎంఐ నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ అంతరాయం
కీసర / అంకిరెడ్డిపల్లి, ఫిబ్రవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):
ఎస్‌ఎస్ నిర్వహణ, కొత్త సర్వీస్ విడుదల, డీసీ పనులు మరియు పలు ఫీడర్లపై పీఎంఐ (పిఎంఐ) నిర్వహణ పనుల కారణంగా నేడు కీసర, అంకిరెడ్డిపల్లి, యాద్గార్‌పల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ఎస్. మురళీ కృష్ణ తెలిపారు.అంకిరెడ్డిపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 11 కేవీ సాల్వో ఎక్స్‌ప్లోజివ్ ఫీడర్ పరిధిలో సాల్వో ఎక్స్‌ప్లోజివ్, బాలాజీ మెటల్, జైరామ్ రెడ్డి మెటల్, జైదేవ్ కాంక్రీట్, క్రషర్స్ కంపెనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. అదేవిధంగా 11 కేవీ తాతా హాస్పిటల్ ఫీడర్, 11 కేవీ పెద్దమ్మ చెరువు ఫీడర్ పరిధిలో అంకిరెడ్డిపల్లి గ్రామం, అంకిరెడ్డిపల్లి చౌరస్తా, తాతా హాస్పిటల్, వాయుపురి వెంచర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.కీసర సబ్ స్టేషన్ నుండి 11 కేవీ అంకిరెడ్డిపల్లి ఫీడర్ పరిధిలో అంకిరెడ్డిపల్లి, శివాజీ నగర్, కీసర గుట్ట రోడ్, సినిమా థియేటర్, మల్లికార్జున నగర్, విఆర్ఆర్ వెంచర్, లలిత ఫంక్షన్ హాల్, రిజిస్టర్ ఆఫీస్, చంద్రగిరి కాలనీ, కీసర గ్రామం ఏజీఎల్ ప్రాంతాల్లో కూడా ఇదే సమయంలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
అలాగే యాద్గార్‌పల్లి సబ్ స్టేషన్ నుండి 11 కేవీ తిమ్మాపల్లి ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిమ్మాపల్లి గ్రామం, నర్సంపల్లి, ధర్మారం గ్రామం, ఏజీఎల్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని, తాత్కాలిక అసౌకర్యానికి చింతిస్తున్నామని ఏఈ ఎస్. మురళీ కృష్ణ విజ్ఞప్తి చేశారు.


Comments