వనపర్తి 28వ వార్డు అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల శిరీష రవికి గెలిపించండి

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

వనపర్తి 28వ వార్డు అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి కోట్ల శిరీష రవికి గెలిపించండి

వనపర్తి,ఫిబ్రవరి7(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణంలోని 28వ వార్డు అభివృద్ధి కోసం మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట్ల శిరీష రవి ని గెలిపించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి  ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా 28వ వార్డులో గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం, పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొంటూ, వనపర్తి మున్సిపల్ పరిధి అభివృద్ధి చెందాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి కోట్ల శిరీష రవి ని కౌన్సిలర్‌గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, 28వ వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వినాయక్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం వినాయక్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం
వినాయక్ నగర్, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు): మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. ఎంపీ ఈటాల రాజేందర్ నిధులతో శివ నగర్...
జె.కే కాలనీలో నూతన బాక్స్ డ్రైన్ పనులకు శంకుస్థాపన
త్రివేణి స్కూల్‌లో 16వ ఫన్ ఫెస్ట్ ఘనోత్సవం.
ఎన్ఎఫ్ఏఈఆర్ సమావేశం విజయవంతం
ఏదులాపురంలో ‘ప్రసాద్ రెడ్డి’  ప్రచారం!
అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం
మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో “ప్రజావాణి” రద్దు