నాచారం డివిజన్‌లో భూగర్భ డ్రైనేజీ పనుల ప్రారంభం

నాచారం డివిజన్‌లో భూగర్భ డ్రైనేజీ పనుల ప్రారంభం

నాచారం, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రూ.40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌తో కలిసి ప్రారంభించారు.
భవాని నగర్ రోడ్ నెంబర్–1లో, వి.ఎస్.టి కాలనీలో టెంపుల్ ఎదురుగా ఉన్న రెండు లైన్లలో, అలాగే ఎర్రగుంట ప్రాంతంలోని లాల్ బహుదూర్ శాస్త్రి సామాజిక భవనం రోడ్డులో ఈ భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. ఈ పనుల ద్వారా వర్షాకాలంలో ఏర్పడే నీటి నిల్వలు, పారిశుధ్య సమస్యలు పరిష్కారమై ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పించబడుతుందని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సిరాజ్, భవాని నగర్–వి.ఎస్.టి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, బారాసా నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎర్రగుంటవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .