ఎన్ఎఫ్ఏఈఆర్ సమావేశం విజయవంతం

పదవీ విరమణ అణుశక్తి ఉద్యోగుల సమస్యలపై విస్తృత చర్చ

ఎన్ఎఫ్ఏఈఆర్ సమావేశం విజయవంతం

ఏ ఎస్ రావు నగర్, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కమలానగర్ కమ్యూనిటీ హాల్‌లో శనివారం జాతీయ అణుశక్తి పదవీ విరమణ ఉద్యోగుల వేదిక (ఎన్ఎఫ్ఏఈఆర్) సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది. అణుశక్తి శాఖ (డిఈఏ)కు చెందిన పదవీ విరమణ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.పదవీ విరమణ ఉద్యోగులను సంఘటితం చేసి, వారి న్యాయసమ్మతమైన హక్కులు, సంక్షేమ ప్రయోజనాల సాధన కోసం ఎన్ఎఫ్ఏఈఆర్ చేపడుతున్న కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సభ్యుల హక్కుల పరిరక్షణకు వేదిక నిరంతరం కృషి చేస్తుందని నేతలు స్పష్టం చేశారు. ఎన్ఎఫ్ఏఈఆర్‌కు ముంబయి, కోటా, బరోడా, చెన్నై, మైసూరు అలాగే తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో శాఖలు ఉన్నాయని తెలిపారు.ఈ సమావేశంలో కామ్రేడ్ జైరాజ్ కె.వి. (జనరల్ సెక్రటరీ, ఎన్ఎఫ్ఏఈఆర్), కామ్రేడ్ వి. నాగేశ్వరరావు (ఏజీ ఆఫీస్ – రిటైర్డ్), కామ్రేడ్ కృష్ణ మోహన్ (చైర్మన్, సిసిజిఓఓ & సెక్రటరీ, టార్ప్స్), కామ్రేడ్ జి.వి.ఆర్. కృష్ణ (కన్వీనర్, ఎన్ఎఫ్ఏఈఆర్ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్), కామ్రేడ్ శంకర్ రెడ్డి (ఉపాధ్యక్షుడు) మరియు కామ్రేడ్ మల్లేశం పాల్గొని ప్రసంగించారు.సమావేశంలో ప్రధానంగా పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, ఇప్పటికే ఉన్న పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ వర్తింపజేయాలని, అలాగే “నాన్-కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కు సంబంధించిన అనిధి వ్యయం” అనే అనుచిత సూచనను 8వ వేతన సంఘం (8వ సిపిసి) టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో ఉద్యమాత్మక కార్యాచరణ చేపట్టాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి పి. మల్లేశం ప్రారంభ ఉపన్యాసం చేయగా, జి.వి.ఆర్. కృష్ణ అధ్యక్షత వహించారు. ఉదయ్ బాస్కర్ వందన సమర్పణ చేశారు.IMG-20260207-WA0096

Tags:

Post Your Comments

Comments

Latest News

వినాయక్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం వినాయక్ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం
వినాయక్ నగర్, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు): మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. ఎంపీ ఈటాల రాజేందర్ నిధులతో శివ నగర్...
జె.కే కాలనీలో నూతన బాక్స్ డ్రైన్ పనులకు శంకుస్థాపన
త్రివేణి స్కూల్‌లో 16వ ఫన్ ఫెస్ట్ ఘనోత్సవం.
ఎన్ఎఫ్ఏఈఆర్ సమావేశం విజయవంతం
ఏదులాపురంలో ‘ప్రసాద్ రెడ్డి’  ప్రచారం!
అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం
మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో “ప్రజావాణి” రద్దు