మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం, కల్లు దుకాణాల మూసివేత

పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం విక్రయాలపై నిషేధం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం, కల్లు దుకాణాల మూసివేత

మేడ్చల్ మల్కాజిగిరి, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో ఈ నెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల పరిధిలో మద్యం, కల్లు దుకాణాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు.ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పోలింగ్ తేదీకి 48 గంటల ముందు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సంబంధిత ప్రాంతాల్లో మద్యం, కల్లు విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత యాజమాన్యాలు, అధికారులు ఎన్నికల నిర్వహణకు పూర్తి సహకారం అందించాలని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .